గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 01:54:03

క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లు 2.40 లక్షలు

క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లు 2.40 లక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా 2.40 లక్షల మంది క్రైస్తవులకు గిఫ్ట్‌ప్యాక్‌లను ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.11 కోట్లు వెచ్చించనున్నారు. టెస్కో ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్న వీటిని సిరిసిల్ల మరమగ్గాలపై తయారు చేయిస్తున్నారు. పండుగల సందర్భంగా ఆయా వర్గాల ప్రజలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అందులోభాగంగా బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరెలు, రంజాన్‌ వేళ ముస్లింలకు తోఫా, క్రిస్మస్‌కు క్రైస్తవులకు గిఫ్ట్‌ప్యాక్‌లు ఇస్తున్నారు.