మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 21:21:23

క్రీస్తు బోధనలు అనుసరణీయం : మంత్రి దయాకర్‌రావు

క్రీస్తు బోధనలు అనుసరణీయం : మంత్రి దయాకర్‌రావు

వరంగల్ అర్బన్ : క్రీస్తు బోధనలు అనుసరణీయమని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా పెద్ద పెండ్యాల  మండలం  కరుణపురం క్రీస్తుజ్యోతి చర్చి, జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లారాయ‌ని తొర్రూరు చ‌ర్చీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

కేక్‌చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాంతిమార్గంలో నడవాలని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తున్నారని, అన్నిమతాల పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది పేర్కొన్నారు. క్రీస్తుజ్యోతి చర్చి నిర్వాహకులు జయ ప్రకాశ్‌, పాల్సన్ తదితరులను అభినందించారు. అంతకుముందు వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు దేవాల‌యాల‌ను మంత్రి సంద‌ర్శించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులోని ముర‌ళీకృష్ణ ఆల‌యంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo