గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 19, 2020 , 00:31:41

గుర్తింపులేని కాలేజీలపై కఠిన చర్యలు

గుర్తింపులేని కాలేజీలపై కఠిన చర్యలు
  • ఇంటర్‌ బోర్డు సమీక్షలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని గుర్తింపులేని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలపై కఠినవైఖరి అవలంబించేందుకు ఇంటర్‌ బోర్డు సిద్ధమైంది. మంగళవారం ఇంటర్‌ బోర్డు అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ సమీక్ష నిర్వహించారు. ఈసారి మే నెలలోనే ప్రైవేట్‌ కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం యూట్యూబ్‌ చానల్‌ ఏర్పాటుచేసి వచ్చే జూన్‌ నుంచి వీడియో పాఠాలను అందుబాటులోకి తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నారు. 79 ప్రైవేట్‌ కాలేజీలకు గుర్తింపులేని విషయాన్ని గుర్తించిన బోర్డు.. ఇందుకు సంబంధించిన నివేదికను బుధవారం ప్రభుత్వానికి అందజేయనున్నది. సమీక్షా సమావేశంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo