గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 02:45:27

మతిమరుపుతో దుబాయ్‌లోనే

మతిమరుపుతో దుబాయ్‌లోనే

  • చింతమన్‌పల్లి వాసి తిప్పలు 
  • పాస్‌పోర్టుపోయి దయనీయస్థితిలో.. 

దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమన్‌పల్లికి చెంది న నీల ఎల్లయ్య 16 ఏండ్లుగా దుబాయ్‌లో దయనీయస్థితిలో కాలం వెళ్ల్లదీస్తున్నాడు. 2004లో విజిట్‌ వీసాపై దుబాయ్‌ వెళ్లిన ఈయన భవన నిర్మాణ కూలీగా పనిచేశాడు. కొంతకాలం తరువాత తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి బయటికి వచ్చేశాడు. దుబాయ్‌లో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పం పించేందుకు అక్కడి అధికారులు 2007లో చర్యలు తీసుకోవడంతో ఎల్లయ్య వారికి పాస్‌పోర్టు అప్పగించా డు. కొన్ని నెలల తరువాత మానసికస్థితి సరిగాలేకపోవడంతో ఎల్లయ్య తాను ఉంటున్న చోటునుంచి వెళ్లిపోయాడు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌, షార్జా ప్రాంతాల్లోని వలస కార్మికులకు జైన్‌ సేవా మిషన్‌ వలంటీర్‌ రూపేష్‌మెహతా ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఎల్లయ్య దయనీయ స్థితిని గమనించి వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే ఇండియన్‌ కాన్సులేట్‌ ద్వారా ఎల్లయ్యకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ ఇప్పిం చి స్వదేశానికి పంపించడానికి రూపేష్‌మెహతా ప్రయత్నించారు. ఎల్లయ్య 16 ఏండ్ల కిత్రం దుబాయ్‌లోకి ప్రవేశించిన పాస్‌పోర్టు వివరాలు సమర్పిస్తేనే తాత్కాలిక పాస్‌పోర్టు జారీ చేయడం వీలవుతుందని వారు స్పష్టం చేశారు. ఎల్లయ్య దగ్గర ఏ ఆధారాలు లేకపోవడంతో ఆయన తెలంగాణలోని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ సహకారాన్ని కోరారు. గత నెల 27న ప్రవాసిమిత్ర ప్రతినిధులు ఎల్లయ్య పాస్‌పోర్టు వివరాలు అందజేయాలని కోరుతూ అతడి భార్య నీల రాజవ్వతో హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేయించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తన భర్తను వెంటనే స్వదేశానికి రప్పించాలని రాజవ్వ కోరారు.



logo