బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 15:15:19

మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు

మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు

ములుగు :  గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం చిన్న జాతర నిర్వహణ తేదీలను ఆలయ కమిటీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరగనుంది. ఈ సంవత్సరం చిన్న మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు ఆలయ కమిటీ, పూజారులు సిద్ధమయ్యారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో  రేపటి నుంచి జాతర పనులు ప్రారంభంకానున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo