ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:40

300% పెరిగిన చైనా సైబర్‌దాడులు

300%  పెరిగిన చైనా సైబర్‌దాడులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గల్వాన్‌ లోయలో చైనా కుట్రలకు భారత్‌ దీటుగా స్పందించడంతో డ్రాగన్‌దేశం కొత్త కుట్రలకు తెరలేపింది. చైనా హ్యాకర్లు ప్రస్తుతం భారత్‌పై దృష్టిపెట్టారని సింగపూర్‌కు చెందిన సైబర్‌ రిసెర్చ్‌ సంస్థ సైఫార్మా పేర్కొన్నది. వీరికి చైనా సైన్యం సహాయం అందిస్తున్నదని తెలిపింది. జూన్‌ 18 తర్వాత భారత్‌పై సైబర్‌దాడులు 300 శాతం పెరిగాయని వెల్లడించింది. తాము గుర్తించిన అంశాలను భారత ప్రభుత్వానికి అందజేశామని సైఫార్మా చైర్మన్‌, సీఈవో కుమార్‌ రితేశ్‌ తెలిపారు. హ్యాకర్లు ప్రస్తుతం కీలకమైన సమాచారంపై దృష్టిసారించారని చెప్పారు. 

లక్షిత వ్యక్తులు, సంస్థల వ్యక్తిగత, వృత్తిగత వివరాలను చోరీచేస్తున్నట్టు చెప్పారు. గల్వాన్‌ ఘటనకు ముందు చైనా హ్యాకర్లు పాకిస్థాన్‌, ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లకు సహాయం చేసేవారని, ఇప్పుడు నేరుగా భారత్‌పై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడులను ఎదుర్కోవాలంటే భారత ప్రభుత్వం తన సాంకేతికతను మరింత పెంచుకోవాలని సూచించారు. 


logo