సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 12:55:10

చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత

చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో చిలుకూరి బాలాజీ ఆలయంలో భక్తులకు దర్శనాలు ఉండవని ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ అన్నారు. అహాబిలం లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయంలో ఉండే అర్చక స్వామికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మా మఠాధిపతి, అహోబిలం పీఠాధిపతి వెంటనే నిర్ణయం తీసుకొని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆలయాన్ని మూసివేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.

అర్చకుడికి  కరోనా సోకితే కొన్ని టీవీ చానళ్లు హేళనగా చూపించాయన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. వాటికన్ సిటీలో ఉండే పోప్ బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ నడుమ నుంచి మాట్లాడారు. ప్రతి మనిషికి కరోనా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందేకే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి. అంతేతప్ప అర్చకులను హేళన చేయడం సరికాదన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చిలుకూరి బాలాజీ ఆలయంలో భక్తులకు భగవతంతుడి దర్శనం ఉండదన్నారు. దీనిని భక్తులు గమనించాలని కోరారు.


logo