శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Mar 24, 2020 , 09:14:49

ఏప్రిల్‌ ఒకటి వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

ఏప్రిల్‌ ఒకటి వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

మొయినాబాద్‌: చిలుకూరు బాలాజీ ఆలయాన్ని  ఏప్రిల్‌ ఒకటవ తేది వరకు మూసివేస్తున్నట్టు ఆలయ అర్చకులు రంగరాజన్‌ తెలిపారు.  ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు విధించిన లాక్‌డౌన్‌ కార్యక్రమంలో భాగంగా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే స్వామి వారికి ఏకాంత ఆరాధన నిర్వహిస్తామని  తెలిపారు. ఈ నెల 25న జరిగే ఉగాది పండుగ పంచాగ శ్రవణం కార్య క్రమాన్ని కూడా స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. 

పంచాంగ శ్రవణాన్ని  పత్రికా ముఖంగా భక్తులకు తెలియజేస్తామ న్నారు. భక్తులు లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొని కరోనా మహమ్మారిని అరికట్టడానికి కృషి చేయాలని చెప్పారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వంం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో సహ కరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కరోనాను తరిమికొడదామని  పిలుపునిచ్చారు.


logo