మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 21:24:40

కల్తీ కారం పొడి పట్టివేత

కల్తీ కారం పొడి పట్టివేత

సూర్యాపేట  : సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరుసగా కల్తీ దందాలు బయటపడుతున్నాయి. మొన్న అంలకార్‌ థియేటర్‌ సమీపంలోని ఓ కిరాణ వ్యాపారి కల్తీ టీపొడి అమ్ముతూ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు పట్టబడగా తాజాగా టాస్క్‌ఫోర్స్‌ దాడిలో జిల్లా కేంద్రంలోని జేజేనగర్‌లో కల్తీ కారం పొడి అమ్ముతున్న వ్యాపారిని పట్టుకున్నారు. పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని జేజే నగర్‌కు చెందిన కొండూరి రవిందర్‌, భార్య వసంత కొన్ని సంవత్సరాలుగా కారంపొడి వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

ఇటీవల అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ కారంపొడి వ్యాపారం చేస్తున్నట్లు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ దృష్టికి వచ్చింది. ఆకస్మికంగా తనిఖీ చేయగా 20కిలోల బస్తాలు 13 సంచులు, కల్తీ కారం తయారీకి వినియోగించే 50కిలోల ఏడుఉప్పు బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కృష్ణమూర్తికి సమాచారం ఇవ్వగా పంచనామా నిర్వహించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. టాస్క్‌ఫోర్స్‌ సమాచారం మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌ ఆదేశాలతో ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి బస్తాలను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. logo
>>>>>>