బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 09:03:30

తోడై ఉంటాం.. తొడిమ‌లు తీస్తాం..

తోడై ఉంటాం.. తొడిమ‌లు తీస్తాం..

‘మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకసాన హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా..’, ‘గరికపచ్చని మైదానాల్లో, తామరపూవుల కోనేరులలో..’ అంటూ అప్పుడెప్పుడో ‘శైశవగీతి’లో బుడతల గురించి శ్రీశ్రీ రాసిన గీతం సారం ఇప్పుడిక్కడ ప్రస్ఫుటించింది. స్కూలున్నప్పుడు స్కూలుకు వెళ్లి, ఇంటికొచ్చాక ఆటకు దిగి అలసిసొలసే ఈ చిన్నారులు కరోనా కారణంగా దాదాపు పది నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. ‘తండ్రి సందిటా, తల్లి కౌగిటా, దేహధూళితో కచభారంతో..’ ఆడుకుంటూనే ఆటవిడుపుగా సాయమూ అందిస్తున్నారు. ‘తొడిమలు తీస్తాం.. తోడై వస్తాం..’ అంటూ తాము ఓ చెయ్యి వేస్తున్నారు. చిట్టి చేతులతో కొందరు చిన్నారులు ఎండు మర్చి తొడిమెలు తీస్తున్న ఈ చిత్రం ఖమ్మం నగరంలోనిది. -ఫోటోలు : ఖ‌మ్మం ఫోటోగ్రాఫ‌ర్‌logo