శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 19:58:40

‘చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’

‘చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’

సిద్దిపేట : చిట్టాపూర్ గ్రామంలో కన్నతండ్రే తన ఇద్దరు ఆడపిల్లల కొంతుకోసి హతమార్చేందుకు యత్నించిన ఘటనపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసుశాఖను ఆదేశించారు. పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు సూచించారు. మంత్రి హరీశ్‌ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఓఎస్డీ బాల్‌రాజ్ దవాఖానలో చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేసి పంపారు. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్యులు పర్యవేక్షించాలని మంత్రి చెప్పారు. సమాచారం తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి చిన్నారుల ప్రాణాలను కాపాడిన భూంపల్లి ఎస్ఐ సర్దార్ జమీల్, కానిస్టేబుల్ రాజిరెడ్డి, బాల్‌రాజ్, రమేశ్‌లను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.