శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 21:21:23

14 మంది బాలకార్మికులకు విముక్తి

14 మంది బాలకార్మికులకు విముక్తి

హైదరాబాద్‌:  గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్‌లో ఉన్న రెండు గాజుల పరిశ్రమల్లో బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో.. టాస్క్ ఫోర్స్ పోలీసులు, దివ్య దిశా చైల్డ్ లైన్ సభ్యులు దాడులు నిర్వహించారు. 14 మంది బాలలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి..రెస్క్యూ హోంకు తరలించారు. వీరంతా బీహార్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


logo