బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:55

బస్సు ఢీకొని చిన్నారి దుర్మరణం

బస్సు ఢీకొని చిన్నారి దుర్మరణం

అల్లాదుర్గం:  ఆర్టీసీ బస్సు ఢీకొ ని ఓ చిన్నారి దు ర్మరణం చెందింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం కాయిదంపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సాత్విక(8) 161వ జాతీయ రహదారి అవతలి వైపు నివాసం ఉంటున్న తన తాత భాగయ్య ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటి తరువాత ఇంటి కి వెళ్తానని తాతకు చెప్పి రహదారి దాటుతుండగా నారాయణఖేడ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్నారిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేటు దవఖానకు తరలించారు. పరిస్థితి విషమించడం తో అక్కడి నుంచి జోగిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. 


logo