సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Apr 23, 2020 , 22:24:27

నుస్తులాపూర్‌కు చైల్డ్‌ హెల్త్‌ అవార్డు

నుస్తులాపూర్‌కు చైల్డ్‌ హెల్త్‌ అవార్డు

కరీంనగర్‌ ‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి జాతీయ ఖ్యాతి లభించింది.. చిన్న పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గుర్తించి కేంద్ర మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ చైల్డ్‌ హెల్త్‌ అవార్డు అందజేసింది. ఈ శాఖ ఆధ్వర్ంయలో చిన్నపిల్లల సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యంపై గతేడాది సర్వే నిర్వహించారు. 29 అంశాల్లో ప్రథమస్థానంలో నిలిచిన గ్రామాలను ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో నున్తులాపూర్‌కు చోటు దక్కింది.. పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల బాల, బాలికలు, పిల్లలు, పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ లేకుండా చూడడం, స్కూల్‌, అంగన్‌వాడీ, వికలాగుల పాఠశాలల సంక్షేమం, టాయిలెట్స్‌, శానిటరీ నాప్‌కిన్స్‌, పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, బాలపంచాయతీ పేరిట మీటింగ్‌ నిర్వహించి సమస్యలు తెలుసుకోవడం లాంటి 29 అంశాలతో సర్వే చేసి గ్రామాన్ని ఎంపిక చేశారు. 


logo