ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 16, 2020 , 21:07:35

ట్రాక్టర్‌ పైనుంచి పడి బాలుడు మృతి

 ట్రాక్టర్‌ పైనుంచి పడి బాలుడు మృతి

ములుగు : ట్రాక్టర్‌ పైనుంచి బాలుడు మృతి చెందాడు. ములుగు మండలం రహీంనగర్ తండా గ్రామంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంనగర్‌ తండాకు చెందిన గుగులోత్ చిన్న లచ్చు ఉదయం తన ట్రాక్టర్‌పై పక్కింటి పిల్లలైన గుగులోత్ రాజేశ్‌ (7),  ఇస్లావత్‌ సాత్విక్‌లను పొలం వద్దకు తీసుకెళ్లాడు. చెలక దున్నుతుండగా అతివేగం కారణంగా రాజేశ్‌ ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో నాగళ్లు తగిలి తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

లచ్చు నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాజేశ్‌ మృతదేహాన్ని పక్కనే ఉన్న బానోత్ స్వామి వ్యవసాయ బావిలో పడవేశాడు. ఇంటికి వెళ్లి ఏమీ తెలియనట్లు వ్యవహరించడంతో బాలుడి తల్లిదండ్రులు నిలదీశారు. లచ్చుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. ములుగు ఎస్ఐ  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo