బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 21:08:36

బొటన వేలితో అతిపెద్ద పెయింటింగ్‌

బొటన వేలితో అతిపెద్ద పెయింటింగ్‌

తాండూర్‌: బొటన వేలితో అతి పెద్ద ఫింగర్‌ ప్రింట్‌ పెయింటింగ్‌ వేసి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ గ్రామానికి చెందిన తల్లం రఘువీర్‌ కుమారుడు సాయి హర్షిత్‌. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలను వివరిస్తూ సాయి హర్షిత్‌ 43 గంటల్లో తన చేతి బొటన వేలి ముద్రలతో (లక్షకు పైగా 31,250 స్కేర్‌ ఇంచెస్‌ (చదరపు ఇంచులు) పెయింటింగ్‌ వేశాడు. 

తన గురువు సత్య ప్రకాశ్‌ ఇచ్చిన తర్ఫీదుతో ఈ ఘనత సాధించాడు. ఆదివారం ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కృష్ణ స్వయంగా పరిశీలించి సాయి హర్షిత్‌కు ధ్రువపత్రాన్ని, గోల్డ్‌మెడల్‌ అందించి సత్కరించారు. సాయి హర్షిత్‌ సాధించిన ఘనత పట్ల తల్లిదండ్రులు, మండల ప్రజలు అభినందించారు.


logo