మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 19:17:56

వరద బాధితులకు నగదు పంపిణీపై సీఎస్‌ సమీక్ష

వరద బాధితులకు నగదు పంపిణీపై సీఎస్‌ సమీక్ష

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో ఆదివారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. వరద బాధిత కుటుంబాలకు నగదు పంపిణీ తీరుపై సమీక్షించారు. ముంపు బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేసిందని, ప్రతి బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలని సూచించారు. ఇప్పటివరకు 3.87 లక్షల కుటుంబాలకు రూ.387 కోట్లు పంపిణీ చేశామని సీఎస్‌కు అరవింద్‌ కుమార్‌ వివరించారు. బాధితులందరికీ పరిహారం అందేలా చూస్తామని ఆయన తెలిపారు. ఇంకా మిగిలిపోయిన బాధితుల‌కు న‌గ‌దు సాయం అందించేందుకు షెడ్యూల్‌ను త‌యారు చేయాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.