e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home తెలంగాణ లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఉత్తర్వులు

లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఉత్తర్వులు

లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఉత్తర్వులు
  • 30 వరకు పొడిగిస్తూ రెండ్రోజులక్రితం సీఎం నిర్ణయం
  • తాజాగా జీవో జారీచేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 12 నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నియంత్రణ కోసం కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, పోలీస్‌ సూపరింటెండెంట్లు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాలని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా చూడాలని సూచించారు. సడలింపులు ఇచ్చిన ఉదయం 6 నుంచి ఉదయం10 గంటల సమయంలోనూ అవసరం ఉంటేనే బయటకు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఉత్తర్వులు

ట్రెండింగ్‌

Advertisement