మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 21:52:01

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఇంజినీరింగ్‌ చీఫ్‌

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఇంజినీరింగ్‌ చీఫ్‌

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సీ మురళీధర్ రావు శుక్రవారం పరిశీలించారు. అశ్వాపురం మండలం భీముడి గుండం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.

అనంతరం కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిర్మించ తలపెట్టిన సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్ట్ నిర్మాణ ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అక్కడి నుంచి సీతారామ ప్యాకేజీ- 1, ప్యాకేజీ 2లో భాగంగా నిర్మిస్తున్న కాల్వతోపాటు ఏకో బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఈ ఇల్లు వెంకట కృష్ణ , శ్రీనివాస్ రెడ్డి డీఈలు తదితరులున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo