ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 08:56:02

ఆందోళన వద్దు.. స్వీయ నియంత్రణ తప్పనిసరి: సీఎం కేసీఆర్‌

ఆందోళన వద్దు.. స్వీయ నియంత్రణ తప్పనిసరి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని.. ఇతరత్రా జబ్బులున్న కొద్దిమంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువైనా సరే.. తగిన వైద్యమందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం సీరియస్‌గా ఉన్నవారికి దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్‌ సోకినప్పటికీ.. లక్షణాలు లేనివారికి ఇండ్లల్లోనే ఉంచి వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. 


logo