మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 16:31:33

యాదాద్రిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

యాదాద్రిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన స్వామి వారి దర్శనానికి వెళ్లగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి, స్వామి వారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీవో భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.


logo