శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 19, 2020 , 22:14:52

ఛత్రపతి శివాజీ సేవలు అనిర్వచనీయం: మంత్రి కొప్పుల

ఛత్రపతి శివాజీ సేవలు అనిర్వచనీయం: మంత్రి కొప్పుల

ధర్మపురి: ఛత్రపతి శివాజీ సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇవాళ మంత్రి ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధర్మపురి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి విగ్రహాన్ని.. మంత్రి  ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 390వ జయంతి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో గొప్ప రాజుగా కీర్తి పొందిన నాయకులు, రాజు, స్ఫూర్తి ప్రధాత శివాజీ మహారాజ్‌ అని అన్నారు. ఆయన చేసిన సేవలు మరాఠీలు, బలహీన వర్గాలు ఎప్పటికీ మరచిపోరని మంత్రి అన్నారు. ఆయన సేవలను నిత్యం తలుచుకుంటూ.. ఆయనను స్ఫూర్తి ప్రధాతగా భావిస్తారనీ, మనం కూడా ఛత్రపతి సేవలు గుర్తు చేసుకోవడం చారిత్రక అవసరమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తమ్మ, జెడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్‌, సామాజిక సమరసత కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాగా, ఇవాళ దేశవ్యాప్తంగా ఛత్రపతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోనూ ఛత్రపతి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాజీ విగ్రహాలను పూలమాలలతో అందంగా అలంకరించి, ఆయనకు నివాళులు అర్పించారు. యువత భారీగా బైక్‌ ర్యాలీలు చేపట్టి, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేశారు. 


logo