శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 15:39:02

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన హారిక ద్రోణవల్లి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన హారిక ద్రోణవల్లి

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ హారిక ద్రోణ‌వ‌ల్లి మాదాపూర్‌లోని త‌న నివాసంలో మూడు మొక్క‌లు నాటారు. బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్లు హ‌రిక తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంతోష్ కుమార్‌కు ఆమె ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.  పర్యావరణ పరిరక్షణ పరమావధిగా సాగుతున్న ఈ యజ్ణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటాల‌ని.. బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు , టెన్నిస్ క్రీడాకారిణి చిలుముల నిధి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుమీత్ రెడ్డిలకు ఛాలెంజ్ చేశారు.


logo