శనివారం 30 మే 2020
Telangana - May 07, 2020 , 02:18:10

మాస్క్‌పై చేర్యాల మార్క్‌

మాస్క్‌పై చేర్యాల మార్క్‌

  • ఖాదీ వస్ర్తాలతో మాస్కుల తయారీ 
  • ట్విట్టర్‌లో అభినందించిన కేంద్రం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌లో కుంగిపోకుండా ఆలోచనకు పదు ను పెట్టి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు చేర్యాల పెయింటింగ్స్‌ కళాకారుడురాకేశ్‌. మాస్కులను ఖాదీ వస్త్రంతో తయారుచేసి.. వాటిపై పెయింటింగ్‌తో అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రాకేశ్‌కు గతంలో ఖాదీవస్త్రంపై పురాణాలను పె యిం టింగ్‌ వేసిన అనుభవం ఉన్నది.  ప్ర స్తుతం రెండులేయర్లతో మాస్కులు కుడుతూ కరోనాపై చైతన్యం కలిగించేలా పెయింటింగ్‌ వేస్తున్నారు. ఈ పెయింటింగ్స్‌కు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ఉండటంతో జాతీయస్థాయిలో డిమాండ్‌ ఏర్పడింది. ఈ మాస్కుల తయారీని కేంద్ర వాణిజ్యశాఖ.. సెం టర్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ఆధ్వర్యంలోని సీఐపీఏఎం అభినందిస్తూ ట్వీట్‌ చేసింది.


logo