గురువారం 02 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 17:36:10

నాలుగు రోజులపాటు చెర్వుగట్టు ఆలయం మూసివేత

నాలుగు రోజులపాటు చెర్వుగట్టు ఆలయం మూసివేత

నల్లగొండ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం నాలుగు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించరు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోలీసు అధికారులు, ఆలయ నిర్వాహాకులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ప్రతి ఆమావాస్య నాడు ఆలయ దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు పోటెత్తుతారు. అమావాస్య ఈ నెల 21వ తేదీన వస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాన్ని నిలువరించేందుకే ఆలయ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు.

ఈ నాలుగు రోజులు పోలీసులు ఘాట్‌ రోడ్డుపై ప్రహారా కాస్తూ భక్తులను కొండపైకి అనుమతించరన్నారు. కావునా భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ దర్శనానికి రావొద్దని సూచించారు. ఆ నాలుగు రోజులు ఇళ్లలోనే పూజలు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 22 తర్వాత భక్తులను ఆలయ దర్శనానికి అనుమతిస్తామన్నారు. కాగా ఈ నాలుగు రోజులు ఆలయ పూజారులు యాధావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్‌ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆలయ ఈవో సులోచన తదితరులు పాల్గొన్నారు.


logo