శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 13:45:21

ఈ 31 వరకు చెర్వుగట్టు దేవస్థానం మూసివేత

ఈ 31 వరకు చెర్వుగట్టు దేవస్థానం మూసివేత

నల్లగొండ : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో గల ప్రసిద్ధ శ్రీ జడల రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానాన్ని ఈ నెల 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలైనటువంటి తుమ్మడం కోటమైసమ్మ, ధర్వేశ్‌పురం వంటి ప్రముఖ ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు. కాగా రోజువారి పూజాదికాలు, కైంకర్యాలు మాత్రం ఆలయ పూజారులు యధాప్రకారం నిర్వహిస్తారన్నారు.  

నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ప్రపంచ విపత్తు కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతో ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెర్వుగట్టుకు వచ్చే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు.


logo