గురువారం 04 జూన్ 2020
Telangana - May 22, 2020 , 16:59:20

చెర్లపల్లి(ఆర్‌) గ్రామ రైతుల ఏకగ్రీవ తీర్మానం

చెర్లపల్లి(ఆర్‌) గ్రామ రైతుల ఏకగ్రీవ తీర్మానం

కరీంనగర్‌ : సర్కారు చెప్పిన పంటలనే సాగు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు సన్నద్ధమౌతున్నారు. ఈ మేరకు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో తాము సైతం అంటూ కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌) గ్రామ రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేస్తామని గ్రామ రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు స్పందిస్తూ... 

తెలంగాణ రాష్ట్రం వచ్చంది. రైతుల కష్టసుఖాలు తెలిసిన బిడ్డ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిండు. రైతులకు మంచిరోజులు వచ్చినయి అన్నారు. సాగునీరు, 24 గంటల కరెంటు, వ్యవసాయానికి పెట్టుబడి సాయం, రైతు కుటుంబాలకు భరోసాగా రైతుబీమా వచ్చిందన్నారు. రైతుల కోసం ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. తమ మంచి కోసం సూచిస్తున్న నియంత్రిత పంటల సాగును చేపడతామని పేర్కొన్నారు.logo