మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 21:16:02

ఆడబిడ్డకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య

ఆడబిడ్డకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య

మహబూబ్‌నగర్‌ : దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా ఆడపిల్లకు జన్మనించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చెన్నకేశవులుది నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌ సమయంలోనే ఆమె గర్భవతి. అయితే గురువారం మధ్యాహ్నం రేణుకా కుటుంబ సభ్యులతో కలసి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో ప్రసవం కోసం వచ్చి చేరింది. శుక్రవారం ప్రసవం జరిగింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. logo
>>>>>>