శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 20:55:31

జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌పై సీఎస్‌ సమీక్ష

జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌పై సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక  పారిశుధ్య డ్రైవ్, బస్తీ దవాఖానాల పని తీరు, వరద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం పంపిణీపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

వరదల అనంతరం హైదరాబాద్‌లో సుమారు 52,000 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాని, 960 బృందాలు ఏర్పాటు చేసి  వ్యర్థాలను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎస్‌కు తెలిపారు. డ్రైవ్‌లో భాగంగా నిర్మాణ వ్యర్థాల తొలగింపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో డిస్‌ఇన్‌ఫెక్టివ్‌ రసాయనాలను చల్లుతున్నామని వెల్లడించారు. సమీక్షలో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.