బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 16:27:07

సోలిపేట సుజాతకే మా మద్దతు : చేగుంట పెన్షనర్ల సంఘం

సోలిపేట సుజాతకే మా మద్దతు : చేగుంట పెన్షనర్ల సంఘం

మెదక్ : దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు చేగుంట పెన్ష‌న‌ర్ల సంఘం మ‌ద్ద‌తు తెలిపింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు సమక్షంలో తీర్మానం చేసింది. ఈ సందర్బంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ఉద్యోగ కార్మిక విధానాల‌ను తీవ్రంగా ఖండించారు. కేంద్రం అనుస‌రిస్తున్న రైతాంగ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేయాల‌న్నారు. తెలంగాణ రైతుల‌కు అండ‌గా నిలవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ కై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తాను అని చెప్పారు. దివంగ‌త ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంతో శ్ర‌మించారు అని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నిక‌లో సోలిపేట సుజాత‌కు పెన్ష‌న‌ర్లు స‌హ‌కారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవో మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పెన్షనర్ల అధ్యక్షులు నర్సిములు, ఉపాధ్యక్షులు రాములుతో పాటు పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.