గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 11:54:54

పెద్దపల్లి జిల్లాలో చిరుతల సంచారం కలకలం

పెద్దపల్లి జిల్లాలో చిరుతల సంచారం కలకలం

పెద్దపల్లి :  పెద్దపల్లి జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతున్నది. గోదావరిఖని ఎన్‌టీపీసీ మల్కాపూర్ శివారులోని శనివారం తెల్లవారుజామున రెండు చిరుతలు సంచరిస్తుండగా జాలర్లు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులులు సంచరిస్తున్నట్లు పేర్కొన్న ప్రదేశానికి చేరుకొని పాదముద్రలు సేకరించారు. పాదముద్రలు పరిశీలించి సంచరిస్తున్నది చిరుత పులులని నిర్ధారించారు.

పులులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులు, జీవాల కాపర్లు నదితీర ప్రాంతాల్లోకి పశువులను తోలుకెళ్లొద్దని కోరారు. గత వారంరోజులుగా గోదావరిఖనిలోని నది పరివాహక ప్రాంతాల్లో పులులు సంచరిస్తుండటంతో స్థానికులు, సింగరేణి కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo