సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:22:15

గోదావరిఖనిలో చిరుత సంచారం

గోదావరిఖనిలో చిరుత సంచారం

ఫర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారులో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. సింగరేణి జీడీకే-1వ గని ఇసుక బంకర్‌ వద్ద శనివారం రాత్రి చిరుత పులి రెండు కుక్కలను చంపి తినేందుకు ప్రయత్నించి అక్కడే పడేసి వెళ్లిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. సింగరేణి అధికారుల సమాచారంతో జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రహమతుల్లా, బీట్‌ ఆఫీసర్‌ నరేశ్‌ తదితరులు బంకర్‌ వద్ద ఇసుకలో చిరుత పులికి సంబంధించి అడుగులను గుర్తించారు. రాత్రి సమయంలో సింగరేణి కార్మికులు విధులకు ఒంటరిగా రావొద్దని అటవీ అధికారి రవిప్రసాద్‌ సూచించారు.logo