సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 21:52:43

సరిహద్దుల్లో అప్రమత్తంగా..

సరిహద్దుల్లో అప్రమత్తంగా..

కోటపల్లి : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద ప్రాణహిత నది వంతెనపై చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేసి ఇటు వాహనాల తనిఖీతో అటూఇటూ వెళ్లే ప్రయాణికులను పరీక్షిస్తున్నారు. ఈమేరకు  లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ రవికుమార్‌, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పిస్తుండడంతో పాటు ఐఆర్‌ థర్మోస్కానర్‌తో టెంపరేచర్‌ చెక్‌చేశారు. ఈ క్రమంలో కోటపల్లి మండలంలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు డీసీఎంలో వచ్చిన వారిని వెనక్కి పంపించారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు.logo