శనివారం 04 జూలై 2020
Telangana - May 27, 2020 , 14:38:05

అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి

అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి

నారాయణపేట : తెలంగాణ - కర్ణాటక సరిహద్దులోని కృష్ణ మండలం వాసునగర్‌ వద్ద జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టును టీఆర్‌ఎస్‌ మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పరిశీలించారు. వాసునగర్‌ సరిహద్దు వద్ద కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

కర్ణాటకలోని రాయచూర్‌ యాదగిరి జిల్లాలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుండటంతో.. తెలంగాణ సరిహద్దు గ్రామాలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే. ప్రజలు సరిహద్దు దాటి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెక్‌పోస్టు వద్ద ఉండే అధికారులు, పోలీసులు కఠిన చర్యలకు వెనుకాడొద్దని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను ఎప్పటికప్పుడు పరీక్షించాలని సూచించారు.

చెక్‌పోస్టును పరిశీలించిన వారిలో నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ డాక్టర్‌ చేతన, ఆర్డీవో శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉన్నారు.


logo