గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 02:27:48

మిషన్‌ భగీరథతో నీటిసమస్యకు చెక్‌

మిషన్‌ భగీరథతో నీటిసమస్యకు చెక్‌

  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ సుమన్‌

మందమర్రి: మిషన్‌ భగీరథతో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మందమర్రిలో రూ.40.10 కోట్లతో చేపట్టనున్న అంతర్గత పైప్‌లైన్‌ నిర్మాణ పనులను బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి సింగరేణిలో ఖాళీగా ఉన్న 2,900 క్వార్టర్లను పేదలకు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 


logo