సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:42

హరితహారంతో కాలుష్యానికి చెక్‌

హరితహారంతో కాలుష్యానికి చెక్‌

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాలుష్య భూతాన్ని తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమా న్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ చెప్పారు. శనివారం ‘పుడమిపై గ్రీన్‌హౌస్‌ వాయువుల తగ్గింపు, పర్యావరణ ప్రభావం- సుస్థిర వాతావరణం’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో గువాహటి నుంచి మండల్‌, మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ నుంచి వినోద్‌కుమార్‌, ఉస్మానియా వర్సిటీ నుంచి ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న 23 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు 230 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆరేండ్లుగా చేపడుతున్నట్టు వినోద్‌కుమార్‌ తెలిపారు. కాలుష్యం ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొంచాల్సిన అవసరం ఉన్నదని గువాహటి ఐఐటీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ బీపీ మండల్‌ చెప్పారు.


logo