బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:59

అద్దె గర్భం ముసుగులో మోసం

అద్దె గర్భం ముసుగులో మోసం

  • రూ.10 లక్షలు ముంచిన ‘సృష్టి’ టెస్ట్‌ట్యూబ్‌ బేబీసెంటర్‌ 
  • ‘విశాఖ’ ఘటనతో పత్తాలేని డాక్టర్‌

మారేడ్‌పల్లి: సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పేరుతో తిష్టవేసి రూ.10 లక్షలకు టోకరా ఇచ్చిన సంఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్నది. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట సంతానం కోసం సికింద్రాబాద్‌లోని కీస్‌ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను గత ఏడాది నవంబర్‌ 11న ఆశ్రయించింది. అద్దెగర్భం ద్వారా శిశువును అందిస్తామని రూ. 10 లక్షలు ఖర్చవుతుందని వైద్యురాలు నమత్ర పేర్కొన్నారు. ఒప్పందం మేరకు వారు డబ్బులు చెల్లించారు. 

ఈ ఏడాది అక్టోబర్‌లో శిశువును అందిస్తామని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌బేబీ సెంటర్‌ నిర్వాహకులు తెలిపారు. సరోగసీ సేవలందించే మహిళ విశాఖపట్టణంలోని తమ ఫర్టిలిటీ సెంటర్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నదని చెప్పారు. విశాఖపట్నంలోని సృష్టి ఫర్టిలిటీ కేంద్రం సరోగసీ పేరుతో శిశువిక్రయాలకు పాల్పడుతున్నట్టు మూడురోజుల క్రితం బహిర్గతమైంది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో సికింద్రాబాద్‌లోని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌కు వెళ్లి బాధితులు ఆరాతీశారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. logo