గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 21:11:21

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లపై చీటింగ్‌ కేసు

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లపై చీటింగ్‌ కేసు

బెల్లంపల్లి ‌: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామ సర్పంచ్‌ రాంటెంకి నిర్మల, ఉప సర్పంచ్‌ చింతం విజయపై తాళ్లగురిజాల పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 2019వ సంవత్సరంలో ఫిబ్రవరి 27 నుంచి ఆగస్టు 27 వరకు ఎలాంటి పనులు చేయకుండా బెల్లంపల్లిలోని రఘు వైండింగ్‌ షాపు పేరిట దొంగ బిల్లులు సృష్టించి, వాటిపై యజమాని సంతకాలను ఫోర్జరీ చేశారు. వాటిని జీపీ రికార్డుల్లో బిల్లులుగా చూపించి రూ.53,900 స్వాహా చేశారనే ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బానోతు సమ్మయ్య వీరిద్దరిపై ఐపీసీ 420, 468 ఆర్‌బీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిధులను స్వాహా చేసిన వీరిని పదవుల నుంచి తొలగించాలని గ్రామపంచాయతీ సభ్యులు కోరుతున్నారు.logo