మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 14:41:36

విశ్రాంత అదనపు ఎస్పీతో సహా రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు

విశ్రాంత అదనపు ఎస్పీతో సహా రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు

సూర్యాపేట : భూమి అక్రమంగా పట్టా చేయించుకున్న విశ్రాంత అదనపు ఎస్పీ కోతి సుదర్శన్‌రెడ్డితోపాటు అప్పటి తుంగతుర్తి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోతోపాటు ప్రస్తుత మద్దిరాల తహసీల్దార్‌పై మద్దిరాల పోలీసులు 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన కోతి సత్యనారాయణరెడ్డి ఖమ్మంలో ఉంటున్నాడు. తల్లిదండ్రుల నుంచి తనకు వారసత్వంగా రావాల్సిన భూమి విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు.

భూమిని తన తమ్ముడు కోతి సుదర్శన్ రెడ్డి సర్వీస్‌లో ఉండగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పట్టా చేయించుకున్నట్టు గుర్తించాడు. ఆర్టీఐ కింద పట్టామార్పిడి వివరాల ప్రొసిడింగ్స్ కాపీని అడుగ్గా ఫైల్ లభ్యం కావడం లేదని అధికారులు సమాచారం ఇచ్చారు. విసిగిపోయిన సత్యనారాయణ రెడ్డి  కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశాడు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మద్దిరాల ఎస్‌ఐ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.