బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 01:15:35

చాటింగ్‌ చీటర్లు.. అపరిచితులుl

చాటింగ్‌ చీటర్లు.. అపరిచితులుl

 • సైబర్‌ స్టాకింగ్‌తో ఇబ్బందులు 
 • మహిళలు, చిన్నారులూ జాగ్రత్త
 • విమెన్‌ సేఫ్టీ వింగ్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ ప్రపంచంలో ఎప్పుడు.. ఎలాంటి ముప్పు వస్తుందో చెప్పలేని పరిస్థితి. గుట్టుగా ఉన్న మన వివరాలు తీసుకొని అసభ్య చాటింగ్‌లు, పోస్టింగ్‌లతో అల్లరిపెట్టే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఇలాంటి నేరాల్లో సైబర్‌ స్టాకింగ్‌ ఒకటి. ప్రధానంగా యువతులు, మహిళలు, చిన్నారులు ఈ వేధింపుల నుంచి బయటపడే మార్గాలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబ్‌హర్‌లో ఆదివారం సైబర్‌ నిపుణులు సూచించారు.  

సైబర్‌ స్టాకింగ్‌ అంటే.. 

ఒక అపరిచిత వ్యక్తి.. వరుసగా మనల్ని ఆన్‌లైన్‌లో ఫాలో అవడానికి ప్రయత్నించడం.. ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం.. మనకు ఇష్టం లేదని స్పష్టమైన సమాచారమిచ్చినాపదేపదే వేధించడమే సైబర్‌స్టాకింగ్‌.

ముందస్తుగా ఇలా చేయాలి..

 • * సోషల్‌మీడియా అకౌంట్లలో మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ పరిశీలించండి. అపరిచిత నంబర్లు, వ్యక్తుల నుంచి వచ్చే సమాచారాన్ని బ్లాక్‌ చేసే ఆప్షన్‌ను ఆన్‌చేయండి. 
 • * స్పామ్‌ మెసేజ్‌ల రూపంలో ఎవరైనా సెక్సువల్‌ పోస్టులు ఇతర అభ్యంతరకర మెసేజ్‌లు పంపితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

ఇప్పటికే బాధితులై ఉంటే..

 • * సైబర్‌ స్టాకింగ్‌ బాధితులై ఉంటే.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సమాచారాన్ని, సోషల్‌ మీడియా అకౌంట్లు, ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేయండి. 
 • * అపరిచితుల అకౌంట్‌, ఫోన్‌ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు. తెలియని నంబర్ల నుంచి మిస్డ్‌కాల్స్‌ వస్తే తిరిగి ఫోన్‌ చేయవద్దు. 
 • * మీకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చే వారి ఫ్రొఫైల్‌ సరైందా?..నకిలీదా?..చెక్‌చేసుకోండి. మీ ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఇతరులకెవరికి పరిచయం ఉన్నారో క్షుణ్ణంగా పరిశీలించుకున్న మీదటే అంగీకరించండి. కొత్తవారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు.
 • * సోషల్‌ మీడియాలో వేర్వేరు అకౌంట్‌కు వేర్వేరు ఈ మెయిల్‌ ఐడీలను వాడాలి. 
 • * మీకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను మాత్రమే సోషల్‌ మీడియాలో అంగీకరించాలి.

ఫిర్యాదు చేయండి ఇలా..

 • * ‘https://cybercrime.gov.in’  కావాలి. నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది. 
 • * రిపోర్ట్‌ అదర్‌ సైబర్‌ క్రైం ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. దానిలో ఫైల్‌ ఏ కైంప్లెట్‌ ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి
 • * నిబంధనలు యాక్‌సెప్ట్‌ చేసిన తర్వాత మన రాష్ట్రం, మన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత వచ్చే బాక్స్‌లో ఫిర్యాదు వివరాలు పూర్తిగా రాయాలి. తర్వాత కేంద్ర అధికారుల నుంచి రాష్ట్ర పోలీసులకు సమాచారం వెళ్తుంది. కేసు దర్యాప్తు చేస్తారు.


logo