బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 18:57:44

మూసీ నీరు నిరంతరం ప్రవహించేలా ఛానెల్‌ ఏర్పాటు : సుధీర్‌రెడ్డి

మూసీ నీరు నిరంతరం ప్రవహించేలా ఛానెల్‌ ఏర్పాటు : సుధీర్‌రెడ్డి

హైదరాబాద్‌ : మూసీ నది చుట్టూ నీరు నిరంతరం ప్రవహించే విధంగా ఛానెల్‌ ఏర్పాటు చేయాలని మూసి నది  అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మూసీ నది పరిరక్షణ పరివాహక అధికారులచే కలిసి సుధీర్‌రెడ్డి జంట నగరాల్లోని మూసినది ప్రవాహ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కాల్వలో మొలిచిన గుర్రపుడెక్కను వెంటనే తొలగించాలన్నారు.

అలాగే మూసినది వెంట దోమల నివారణకు డ్రోన్స్‌ ఏర్పాటు చేసి వాటిచే ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. మూసి చుట్టూ ఇంటి నిర్మాణ వ్యర్థాలను పోసి మూసినది వెడల్పు తక్కువ చేస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు. మూసినదిలో 50 అడుగుల వరకు నాలను వెడల్పు చేసి నిరంతరం నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 8 డ్రోన్స్‌ కొనుగోలు చేసి బాపుఘాట్‌ నుండి నాగోల్‌ బ్రిడ్జి వరకు డ్రోన్‌ సహాయంతో స్ప్రే చేసి దోమలను నిర్మూలించే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.


logo