ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 08:02:32

ఆహార‌పు అల‌వాట్లూ క్యాన్స‌ర్‌కు కార‌ణం: మంత్రి ఈట‌ల‌

ఆహార‌పు అల‌వాట్లూ క్యాన్స‌ర్‌కు కార‌ణం: మంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్‌: క‌్యాన్స‌ర్‌ను ముందుగా గుర్తించ‌డ‌మే ముఖ్య‌మ‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఆహార‌పు అల‌వాట్లు మార‌డం కూడా క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌న్నారు. క్యాన్స‌ర్‌పై అవ‌గాన‌ కోసం గ్రేస్ క్యాన్స‌ర్ ఫౌండేష‌న్ ఏర్పాటుచేసిన‌ గ్లోబ‌ల్ వ‌ర్చువ‌ల్ ర‌న్ కార్య‌క్ర‌మాన్ని గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ద్ద ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్‌, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌న్నార్‌తో క‌లిసి మంత్రి  ప్రారంభించారు. దేశంలో ప్ర‌తియేటా 15 శాతం మంది క్యాన్స‌ర్‌తో చ‌నిపోతున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న పెరిగింద‌న్నారు. ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయ‌ని చెప్పారు. క్యాన్స‌ర్ నివార‌ణ‌కు ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ద‌వాఖాన‌ల్లో మెరుగైన స‌దుపాయాలు కల్పిస్తామ‌న్నారు. ఈసంద‌ర్భంగా ఎన్ఎండీసీ అందించిన క్యాన్స‌ర్ స్క్రీనింగ్ వాహ‌నాన్ని మంత్రి ఈట‌ల ప్రారంభించారు. 


logo