శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 00:52:51

ఇద్దరూ ఔటేనా..?

ఇద్దరూ ఔటేనా..?
  • త్వరలో టీపీసీసీ, బీజేపీ అధ్యక్షుల మార్పు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పు తప్పదని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. వచ్చేనెలలోనే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మార్పు ఖాయమన్న అంచనాతో ఎంపీ కోమటిరెడ్డితోపాటు పలువురు ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ ఇస్తారని ప్రచారం జరిగినా, చాలామంది సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో మొరపెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కూడా పదవీగండం తప్పదని భావిస్తున్నారు. ఈ పదవికి ఎంపీలు అర్వింద్‌కుమార్‌, బండి సంజయ్‌తోపాటు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.


logo