గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:21:44

వచ్చే ఏడాదికి చంద్రయాన్‌-3 రెడీ

వచ్చే ఏడాదికి చంద్రయాన్‌-3 రెడీ
  • గగన్‌యాన్‌తో అంతరిక్షంలోకి వ్యోమగాములు
  • ఇస్రో విశ్రాంత డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కమలాకర్‌

ఖైరతాబాద్‌ : చంద్రుడిపై కాలుమోపడంతోపాటు అక్కడి నీటి, ఖనిజ నిక్షేపాలను గుర్తించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-3 ప్రయోగానికి రంగం సిద్దం చేస్తుందని ఆ సంస్థ విశ్రాంత డైరెక్టర్‌, సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంట ర్‌ బెంగళూరు ప్రొఫెసర్‌ జేఏ కమలాకర్‌ తెలిపారు. ది ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా (ఐఈఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ‘స్పేస్‌ అండ్‌ పానిటరీ ఎక్స్‌ప్లోరేషన్‌ బై ఇస్రో అండ్‌ బియాండ్‌' అనే అంశంపై డాక్టర్‌ జే పురుషోత్తం 15వ స్మారక ఉపన్యాసమిస్తూ తొలిసారి భారత్‌ నిర్మించిన వ్యోమనౌక ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రయత్నం జరుగుతున్నదన్నారు.


గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నామన్నారు. చంద్రయాన్‌-3కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది రోవర్‌ను చంద్రుడిపై దించుతామని వెల్లడించారు. సూర్యుడిపై అధ్యయనానికి త్వరలోనే ఆదిత్య-1 ఉపగ్రహాన్ని పంపుతున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో భూగోళంపై ఖనిజాలు అంతరించిపోతే ఇతర గ్రహాల నుంచి తీసుకురావడానికి గల అ వకాశాలను పరిశీలిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఐఈఐ తెలంగాణ చైర్మన్‌ రామేశ్వర్‌రావు, కార్యదర్శి అంజయ్య, సహాయ కార్యదర్శులు జీ రాధాకృష్ణ, ప్రొఫెసర్‌ రమణా నాయక్‌, పీఎల్‌ పాండా తదితరులు పాల్గొన్నారు. 


logo