మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 18:10:15

చంద్ర‌బాబుకు త‌ప్పిన పెను ప్ర‌మాదం

చంద్ర‌బాబుకు త‌ప్పిన పెను ప్ర‌మాదం

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న‌ కాన్వాయ్‌లోని ఓ వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. ఆవు అడ్డు రావ‌డంతో ఎస్కార్ట్ వాహ‌నం డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశారు. స‌డెన్ బ్రేక్ వేయ‌డంతో వాహ‌నాలు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్ప‌ల్ మండ‌లం దండుమ‌ల్కాపురం వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదంలో చంద్ర‌బాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. 


logo