గురువారం 16 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 15:32:30

కర్నల్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

కర్నల్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

సూర్యాపేట : కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఫోన్‌ ద్వారా పరామర్శించారు. సంతోష్‌ తండ్రి ఉపేందర్‌కు చంద్రబాబు ఫోన్‌ చేసి పరామర్శించారు. దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి సంతోష్‌. అమర వీరుడి ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణం. భరతమాత ముద్దుబిడ్డ సంతోష్‌. సంతోష్‌ బాబు రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు స్ఫూర్తిదాయకం అని బాబు అన్నారు. ఆయన లేని లోటు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.


logo