సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 16:23:35

ఇవాళ, రేపు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం

ఇవాళ, రేపు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి, రెండుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆదివారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే వీలుందని పేర్కొంది. పలుచోట్ల ఉదయం  తీవ్రంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది.

ఇదిలాఉండగా ఆదిలాబాద్‌లో ఒకట్రెండు చోట్ల శీతలగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని,  ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి రాష్ట్రంలోకి శీతలగాలులు ప్రవేశిస్తున్నందున ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా దక్కన్‌ పీఠభూమి పరిధిలో ఉండటంతో మిగిలిన ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటుంది.  హిమాలయాల నుంచి వచ్చే శీతలగాలులు తొలుత ఇక్కడే ప్రవేశిస్తాయి. శీతాకాలంలో జిల్లాలో అటవీ ప్రాంతాల పక్కనే ఉండే పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ఇదేనని కారణమని వారు పేర్కొంటున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo