శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 02:14:27

ఈఎస్‌ఐలో అక్రమాలను సహించం

ఈఎస్‌ఐలో అక్రమాలను సహించం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈఎస్‌ఐలో గతేడాది మందుల ఖరీదు, సరఫరాలో అవకతవకల తర్వాత కూడా ఇప్పటికీ డిస్పెన్సరీల్లో మందులు అందుబాటులో లేకపోవడం శోచనీయమని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూరు మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి నెల ఇండెంట్లు పంపుతున్నారు కానీ, 20 కోట్ల విలువైన మందులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. శుక్రవారం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో జరిగిన ఈఎస్‌ఐ వైద్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి డిస్పెన్సరీలో మం దుల కొరత గురించి వైద్యులు, ఫార్మాసిస్టులు చెప్పాలని ఆదేశించారు. రోగులకు సమయానికి మందులు అందాలని, ఆ విషయాలన్నీ ఒక యాప్‌లో చేర్చాలని సూచించారు. ఈఎస్‌ఐ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. రోగులకు వీఐపీ తరహా చికిత్స అందించాలని చెప్పారు. గతంలో జరిగినవి మరిచిపోయి, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. అక్రమాలను సహించేది లేదని స్పష్టంచేశారు.