ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 18:11:13

చైతన్యమూర్తి.. యువతకు స్ఫూర్తి : మంత్రి ఎర్రబెల్లి

చైతన్యమూర్తి.. యువతకు స్ఫూర్తి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : స్వామి వివేకానంద చైతన్యమూర్తి..యువతకు స్ఫూర్తి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చైతన్య తేజోమూర్తి అన్నారు. వివేకానంద బోధనలు విశ్వవ్యాప్తంగా పేరుగాంచాయి. ఆయన సూక్తులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి అని మంత్రి చెప్పారు. నేటి యువత  స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి..

రంగుల హరివిల్లుగా మారిన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌

ఎమ్మెల్సీ కవితను కలిసిన ఒగ్గు కళాకారులు

మినీ డెయిరీ పథకాన్ని విజయవంతం చేద్దాం 

సాగు చ‌ట్టాలపై సుప్రీం స్టే.. చ‌ర్చ‌ల కోసం క‌మిటీ