శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 14:29:56

న‌ల్ల‌గొండ అభివృద్ధికి నాయిని కృషి : మ‌ండ‌లి ఛైర్మ‌న్‌ గుత్తా

న‌ల్ల‌గొండ అభివృద్ధికి నాయిని కృషి : మ‌ండ‌లి ఛైర్మ‌న్‌ గుత్తా

హైద‌రాబాద్ : తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి భౌతిక‌కాయానికి మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ సంద‌ర్భంగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌కు నాయిని మ‌ర‌ణం తీర‌ని లోటు అని పేర్కొన్నారు. న‌ల్ల‌గొండ జిల్లా అభివృద్ధికి ఆయ‌న ఎంతో కృషి చేశార‌ని గుర్తు చేశారు. జ‌న‌తా పార్టీ నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన నాయిని.. టీఆర్ఎస్ పార్టీలో కీల‌కంగా ప‌ని చేశారు అని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు.